జన బాంధవుడు జగ్జీవన్ రాం
దేశ చరిత్రలో చెరగని సంతకం
హైదరాబాద్ – దీన జన బాంధవుడు బాబు జగ్జీవన్ రాం. ఆయన నిర్వహించని పదవంటూ లేదు. భారత దేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న అరుదైన ప్రజా నాయకుడు. ఆయన స్వస్థం బీహార్. ఏప్రిల్ 5, 1908లో పుట్టారు. జూలై 6, 1986లో తనువు చాలించారు. స్వాతంత్ర సమర యోధుడిగా, సంఘ సంస్కర్తగా , బహుజనుల బాంధవుడిగా పేరు పొందారు జగ్జీవన్ రాం. బాబూజీగా గుర్తింపు పొందారు. 40 ఏళ్ల పాటు వివిధ హోదాలలో పదవులు చేపట్టి వాటికే వన్నె తెచ్చిన నాయకుడు. ఉప ప్రధానిగా పని చేశారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కావాలంటూ కోరారు. ఇందు కోసం సంస్థను ఏర్పాటు చేశారు . 1937లో బీహార్ శాసన సభకు ఎన్నికయ్యారు జగ్జీవన్ రాం. కార్మిక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.
1946లో నెహ్రూ తాత్కాలిక సర్కార్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ దేశంలో తొలి క్యాబినెట్ కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు జగ్జీవన్ రాం. అంతే కాదు భారత రాజ్యాంగ పరిషత్ లో సభ్యుడు కూడా. 1971తో జరిగిన ఇండియా- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్దం లో రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ దేశంలో హరిత విప్లవానికి నాంది పలికాడు. వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో కీలక పాత్ర పోషించారు. కరువు కాలంలో గట్టెక్కించిన వ్యక్తిగా పేరు పొందారు జగ్జీవన్ రాం.
1977లో కాంగ్రెస్ ను వీడారు. జనతా పార్టీ కూటమిలో చేరారు. 1981లో భారత జాతీయ కాంగ్రెస్ (జె) పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. భారతీయ కుల వ్యవస్థలోని చమర్ కులంలో పుట్టారు. ఎన్నో పదవులు నిర్వహించారు ఆయన . ఇవాళ బాబూజీ లేక పోయినా తను దేశం కోసం అందించిన సేవలు ఎల్లప్పటికీ గుర్తుండి పోతారు.