టీడీపీ సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్
ప్రకటించిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ
హైదరాబాద్ – ప్రముఖ నటుడు, మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ చర్చనీయాంశంగా మారారు. ఆయన గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చారు. ఈసారి ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించక పోవడంతో తీవ్ర ఆరోపణలు చేశారు భారతీయ జనతా పార్టీపై. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీనే లేకుండా చేస్తానని ప్రకటించారు అప్పట్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆయన సీఎంగా ఉన్నంత వరకు టీడీపీని ఖాళీ చేయించాలని చూశారు. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టిన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల అనంతరం తిరిగి ఏపీలో కాలు మోపారు. సీఎంగా కొలువు తీరారు.
ఇక తనకు ఇబ్బందిగా మారిన కేసీఆర్ పవర్ లోకి రాక పోవడం, తను లీడర్ గా తయారు చేసిన ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా రావడంతో ఇరు రాష్ట్రాలు తన కంట్రోల్ కు వచ్చాయని ముచ్చట పడ్డారు చంద్రబాబు నాయుడు. ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఇక్కడ ఆంధ్రుల ఓటు బ్యాంకు నగరంలో ఎక్కువగా ఉంది.
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ మంగళవారం సభ్యత్వ నమోదు చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది టీడీపీ.