22న పీవీ సింధు వివాహం
వెంకట దత్త సాయితో పెళ్లి
అమరావతి – ఏపీకి చెందిన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తతో ఆమె ఎంగేజ్ మెంట్ జరిగింది. ముహూర్తం కూడా ఖరారు చేశారు ఇరు కుటుంబాల పెద్దలు.
ఈ మేరకు డిసెంబర్ 22న ఉదయపూర్ లో పెళ్లి జరగనుంది. హైదరాబాద్ కు చెందిన పోసిడెక్స్ టెక్నాలజీస్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న వెంకట సాయి దత్తను పెళ్లి చేసుకోకున్నారు పీవీ సింధు.
ఇదిలా ఉండగా పీవీ సింధు ఒక స్వర్థంతో పాటు ఐదు ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలను సాధించింది. ఇండియన్ అథ్లెట్లలలో ఒకరిగా గుర్తింపు పొందింది.
“రెండు కుటుంబాలకు ఒకరికొకరు తెలుసు, కానీ ఒక నెల క్రితమే ప్రతిదీ ఖరారు చేయబడింది. జనవరి నుంచి ఆమె షెడ్యూల్ చురుగ్గా సాగుతుంది కాబట్టి ఇది ఒక్కటే సాధ్యమయ్యే అవకాశం’’ అని సింధు తండ్రి పివి రమణ మీడియాకు వెళ్లడించారు.
పీవీ సింధు రియో 2016 , టోక్యో 2020లో బ్యాక్-టు-బ్యాక్ ఒలింపిక్ పతకాలను గెలుచుకున్నారు. 2017లో కెరీర్-అత్యున్నత ప్రపంచ ర్యాంకింగ్ 2వ స్థానాన్ని సాధించారు.