NEWSTELANGANA

బ‌స‌వ తార‌కం స‌రే ఆస్ప‌త్రుల‌ మాటేంటి

Share it with your family & friends

కాంగ్రెస్ బ‌హిష్కృత నేత బ‌క్క జ‌డ్స‌న్
హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ బ‌హిష్కృత నాయ‌కుడు బ‌క్క జ‌డ్స‌న్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. బ‌స‌వ తార‌కం ఆస్ప‌త్రి వార్షికోత్స‌వానికి వెళ్ల‌డం, స‌ద‌రు ఆస్ప‌త్రికి ప్ర‌భుత్వం స్థ‌లం కేటాయిస్తుంద‌ని చెప్ప‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చెందిన భూమిని కేటాయించాల‌ని చూస్తే చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు బ‌క్క జ‌డ్స‌న్. బ‌స‌వ తార‌కం వెళ్ల‌డం త‌ప్పు కాదు కానీ సీఎంగా కొలువు తీరి ఆరు నెల‌లు పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ప్ర‌భుత్వ ద‌వాఖానా అయినా సంద‌ర్శించారా అని ప్ర‌శ్నించారు.

గాంధీ కానీ , ఉస్మానియా ఆస్ప‌త్రి కానీ చివ‌ర‌కు ఎంజీఎం ఆస్ప‌తిని సంద‌ర్శించ లేద‌ని నిల‌దీశారు. ప్ర‌జా పాల‌న పేరుతో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. రాష్ట్రంలో 2 ల‌క్ష‌ల‌కు పైగా జాబ్స్ ఉన్నాయ‌ని వాటిని వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని బ‌క్క జ‌డ్స‌న్ డిమాండ్ చేశారు.