ENTERTAINMENT

‘తెలంగాణం’ ద‌క్కిన పుర‌స్కారం

Share it with your family & friends

ఫిల్మ్ ఫేర్ అవార్డుల‌లో అగ్ర‌స్థానం

హైద‌రాబాద్ – తెలంగాణ ఆత్మ గౌర‌వానికి అరుదైన పుర‌స్కారం ద‌క్కింది. నిన్న‌టి దాకా ఆంధ్రా ఆధిప‌త్యం చెలాయిస్తూ భాష‌ను, యాస‌ను వెక్కిరిస్తూ వ‌చ్చిన వారికి చెంప పెట్టు తాజాగా ప్ర‌క‌టించిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల ప్ర‌క‌ట‌న‌.

తెలంగాణ ఆధారిత చిత్రాలే ఆధిప‌త్యం కొన‌సాగింది. తెలంగాణ మాండలికాన్ని ప‌దే ప‌దే వెక్కిరింత‌కు లోనైంది..అవ‌మానాల‌కు గురైంది. ఎప్పుడైతే కేసీఆర్ రంగంలోకి దిగాడో..ఆనాటి నుంచి తెలంగాణ భాష‌కు గౌర‌వం ద‌క్కింది.

రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత సీన్ మారింది. సినిమాలో మార్పులు రావ‌డం మొద‌ల‌య్యాయి. ఆనాడు నిరాద‌క‌ర‌ణ‌కు గురైన తెలంగాణం ఇప్పుడు ఆధిప‌త్యం దిశ‌గా సాగుతోంది. ఇప్పుడు అవార్డుల మోత మోగిస్తుండ‌డం విశేషం.

తెలంగాణ నేప‌థ్యం ఆధారంగా తెర కెక్కించిన సినిమాలు ఫిల్మ్ ఫేర్ లో అత్య‌ధిక పుర‌స్కారాలు ద‌క్కించుకున్నాయి. ఉత్త‌మ చిత్రంగా క‌మెడియ‌న్ వేణు ద‌ర్శ‌కత్వం వ‌హించిన బ‌ల‌గం నిలిచింది. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా ఈ చిత్రానికి గాను వేణు యెల్దండికి ద‌క్కింది. ఉత్త‌మ స‌హాయ న‌టిగా బ‌ల‌గంలో న‌టించిన రూపా ల‌క్ష్మికి దక్కింది.

ఉత్త‌మ న‌టుడిగా ద‌స‌రా మూవీకి గాను నానికి, ఉత్త‌మ న‌టిగా ఇదే చిత్రంలో న‌టించిన కీర్తి సురేష్, ఉత్త‌మ నూత‌న ద‌ర్శ‌కుడిగా శ్రీ‌కాంత్ ఓదెల‌కు ద‌క్కింది. ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫీ కింద స‌త్య‌న్ సూర్య‌న్, ఉత్త‌మ కొరియో గ్ర‌ఫీ కింద ప్రేమ్ ర‌క్షిత్ , ఉత్త‌మ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ గా కొల్లా అవినాష్ ను అవార్డు వ‌రించింది.