NEWSANDHRA PRADESH

వేగ జ్యుయ‌ల‌రీ షో రూం ప్రారంభం

Share it with your family & friends

ప్రారంభించిన బాల‌కృష్ణ‌, సంయుక్త మీన‌న్

అమ‌రావ‌తి – నమ్మకం, నాణ్యతలు ఆభరణాలుగా ఎన్నో ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్ర ప్రజల విశ్వాసం చూరగొన్న వేగ జ్యుయలర్స్ కాకినాడ లోని బాలాజీ చెరువు సమీపంలో తమ 4వ నూతన షోరూం ప్రారంభించింది.

ఈ సరికొత్త షోరూం ను వేగ జ్యుయలర్స్ ప్రచారకర్త (బ్రాండ్ అంబాసిడర్) ప్రముఖ సినీ నటులు నందమూరి బాలకృష్ణ‌, సినీతార సంయుక్త మీనన్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన రోజు నుంచి ప్రతి వేడుకకు మన అమ్మాయికి కొనే బంగారం విలువ ఆమె వయసు తోపాటు పెరుగుతూ వస్తుందన్నారు. బంగారమంటే ఖర్చు మాత్రమే కాదని అది భవిష్యత్తు తరాలకు సంపద అన్నారు.

ఇక్కడ ఒక రకం మోడల్ చూపించమంటే వందల రకాలు చూపిస్తున్నారని ప్రముఖ సినీ నటి సంయుక్త మీనన్ సంతోషంగా అన్నారు. సంస్థ య‌జ‌మానులు వ‌న‌మా న‌వీన్ , వ‌న‌మా సుధాక‌ర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి నాణ్య‌మైన ఆభ‌ర‌ణాల‌ను అంద‌జేస్తూ వ‌స్తున్నామ‌న్నారు.

కాకినాడ పట్టణంలో తమ షోరూం ప్రారంభించటం చాల సంతోషంగా ఉంద‌న్నారు. నూతన షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు నుంచి డిసెంబర్ 12 వ తేదీ వరకు ప్రజలకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రతి ఆభరణం పైన VA 4.99% నుంచి 11.99% వరకు ఉంటుందని, BIS హాల్ మార్క్ బంగారు ఆభరణాలు , సర్టిఫికేట్ తోటి డైమండ్స్ క్యారట్ ధర రూ.50,999/- మాత్రమేనని వారు తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకుని రాబోయే క్రిస్టమస్, న్యూ ఇయర్ , సంక్రాంతి పండుగలను , వివాహాది వేడుకలను మరింత ఆనందంగా జరుపు కోవాల‌ని కోరారు.

తమ షోరూం నందు సాంప్రదాయ ఆభరణాల నుండి ఆధునిక ఫ్యాషన్ ఆభరణాల వరకు చిన్న కాసు నుంచి భారీ వడ్డాణాల‌ వరకు, ముక్కు పుడక నుంచి ముత్యాల హారాలు వరకు, ఎన్నో రకాల ఉంగరాలు, చెవి దుద్దులు, గాజులు, నక్లేసులు, బ్రాస్ లెట్స్ మొదలైనవి అన్ని వర్గాల వారికి అనువైనవి అందిస్తున్నామని అన్నారు.

వధువు ధరించే ఆభరణాల నుంచి రోజు ధరించే ఫ్యాన్సీ ఆభరణాల వరకు, వివాహాల కోసమైనా లేదా బహుమతిగా ఇవ్వటం కోసమైనా ఇంట్లో జరిగే వేడుక ఏదైనా వేగ తోడుంటే అది మరపురాని మధురానుభూతిని కలకాలం నిలుపుతుందని స్ప‌ష్టం చేశారు వేగ జ్యుయ‌ల‌ర్స్ య‌జ‌మానులు.