NEWSANDHRA PRADESH

బాల‌య్య ఆస్తుల విలువ రూ. 280 కోట్లు

Share it with your family & friends

భార్యపై 140 కోట్లు కొడుక్కి 58 కోట్లు

స‌త్య‌సాయి జిల్లా – ప్ర‌ముఖ న‌టుడు, హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ కుటుంబీకుల ఆస్తుల విలువ ఏకంగా రూ. 280 కోట్లుగా ఉంది. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌ను దాఖ‌లు చేసిన ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో పేర్కొన్నారు. ఇక టీడీపీ చీఫ్ , మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న బావ‌. ఆయ‌న ఆస్తుల విలువ రూ. 981 కోట్లు . ఇక నంద‌మూరి కుటుంబీకుల మొత్తం ఆస్తుల విలువ లెక్క క‌డితే ఇంకెన్ని కోట్లు ఉంటాయో వెల్ల‌డిస్తే కానీ తెలియ‌దు.

ఇది ప‌క్క‌న పెడితే బాల‌కృష్ణ త‌న స‌తీమ‌ణి వ‌సుంధ‌ర‌తో క‌లిసి హిందూపురం ఎన్నిక‌ల అధికారి కార్యాల‌యంలో రిటర్నింగ్ ఆఫీస‌ర్ కు నామినేష‌న్ ప‌త్రాలు స‌మ‌ర్పించారు. దీని ప్ర‌కారం చూస్తే నంద‌మూరి బాల‌య్య బాబు ఆస్తుల విలువ రూ. 81.63 కోట్లు కాగా, భార్య వ‌సుంధ‌ర ఆస్తుల విలువ రూ. 140 కోట్ల 38 ల‌క్ష‌ల 83 వేల రూపాయ‌లు, కొడుకు మోక్ష‌జ్ఞ ఆస్తుల విలువ రూ. 58 కోట్ల 63 ల‌క్ష‌ల 66 వేలుగా ఉన్న‌ట్లు తెలిపారు.

మొత్తం ఈ ముగ్గురి ఆస్తుల విలువ క‌లిపితే రూ. 280 కోట్లుగా తేలింది. అప్పులకు సంబంధించి చూస్తే బాలకృష్ణకు రూ.9 కోట్లు 9 లక్షల 22 వేలు అప్పు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన భార్య వసుంధర అప్పులు రూ.3 కోట్ల 83 లక్షల 89 వేలుగా చూపించారు.