నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
హైదరాబాద్ – నటుడు నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలు సక్సెస్ కావాలని, తెలుగు చలన చిత్ర పరిశ్రమ బావుండాలని అన్నారు. తనతో పాటు రామ్ చరణ్ కలిసి నటించిన మూవీస్ ను ఆదరించాలని కోరారు. సినీ ఇండస్ట్రీ వల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోందని చెప్పారు. తన వరకు సినిమాలకు సంబంధించి సక్సెస్, ఫెయిల్యూర్ ను పట్టించుకోనని అన్నారు బాలయ్య.
ఇదిలా ఉండగా తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి రెండు కుటుంబాలు కేసులతో సతమతం అవుతున్నాయి. ఒకటి మెగా ఫ్యామిలీకి సంబంధించిన కేసు కాగా మరోటి మంచు కుటుంబానికి సంబంధించింది.
ఒకరేమో అల్లు అర్జున్ కాగా మరొకరు మంచు ఫ్యామిలీకి చెందిన కేసు కావడం గమనార్హం. ఇప్పటికే పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా తన కొడుకు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇక మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తుల తగాదా చోటు చేసుకుంది.