సంచలన కామెంట్స్ చేసిన బాలకృష్ణ
కృష్ణా జిల్లా – ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీ హాజరయ్యేందుకు వచ్చిన సందర్బంగా మీడియాతో మాట్లాడారు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో.
వైసీపీ వాళ్లు రాకుండా ఉంటేనే బెటర్ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఇవాళ కూడా వాళ్లు రాకుంటేనే మంచిదన్నారు. ఆయన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. ఆనాడు షర్మిలపై తాను అసత్య ప్రచారం చేశానని చెప్పడం తన విజ్ఞతకే వదిలి వేస్తున్నానని అన్నారు .
ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేశారో, కామెంట్స్ పోస్ట్ చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు నందమూరి బాలకృష్ణ. స్వంత తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిలా రెడ్డిపై సభ్య సమాజం తల దించుకునేలా మాట్లాడితే, కామెంట్స్ పెడితే జగన్ రెడ్డి ఎందుకు పట్టించు కోలేదని ధ్వజమెత్తారు.
ఆయనే పట్టించు కోనప్పుడు , తాము ఎందుకు పట్టించు కోవాలంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఇదేనా మీ సంస్కారం అంటూ మండిపడ్డారు నందమూరి బాలకృష్ణ. గత ఐదేళ్ల కాలంలో ఏపీని సర్వ నాశనం చేసిన చరిత్ర మీది కాదా అంటూ ప్రశ్నించారు. వాళ్లు శాసన సభకు, శాసన మండలికి వచ్చి చేసింది ఏముందంటూ ఎద్దేవా చేశారు.