ఘోరమైన చేష్టలు దేనికి సంకేతం
హైదరాబాద్ – బాలకృష్ణ నటించిన డాకూ మహరాజ్ జనవరి 4న విడుదల కానుంది. ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన దబిడి దబిడి సాంగ్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. డ్యాన్స్ పేరుతో ఇంచ నీచమైన కంపోజిషన్ ఏంటి అంటూ మండి పడుతున్నారు. బాలకృష్ణ ఓ ఎమ్మెల్యే అయి ఉండి ఇంత ఘోరమైన చేష్టలు దేనికంటూ ఫైర్ అవుతున్నారు. తన కన్నా కూతురు వయసున్న నటితో నీచమైన స్టెప్పులు ఏంటి అంటూ భగ్గుమంటున్నారు.
ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ పాటను థమన్ తో పాటు ఎస్. వాగ్దేవి పాడారు. కొరియోగ్రఫీ దారుణంగా ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ పాట గురించి తీవ్రంగా స్పందిస్తున్నారు.
సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారో చెప్పాలని బాలకృష్ణను ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో నిర్మాత, డైరెక్టర్ తీరుపై సీరియస్ అయ్యారు. మొత్తంగా సభ్య సమాజం తల దించుకునేలా ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేశారంటూ భగ్గుమంటున్నారు.