DEVOTIONAL

కోదండ‌రాముడి గుడిలో శాస్త్రోక్తంగా బాలాల‌యం

Share it with your family & friends

ఘ‌నంగా నిర్వ‌హించిన ఆల‌య నిర్వాహ‌కులు

తిరుప‌తి – ప్ర‌ముఖ పుణ్య క్షేత్రం ఒంటిమిట్ట లో కొలువు తీరిన శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా ”బాలాలయం” నిర్వ‌హించారు.

ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయంలో ఆదివారం ఆగ మోక్తంగా ”బాలాలయం” చేప‌ట్టారు.

ఇందులో భాగంగా ఉద‌యం అగ్నిప్ర‌ణ‌య‌ణం, దారు (చక్క) విగ్రహాలు, కుంభారాధ‌న‌, అక‌ల్మ‌ష‌హోమం, మహా పూర్ణాహుతి నిర్వ‌హించారు. అనంతరం బాలాల‌య మ‌హాశాంతి ప్రోక్ష‌ణ చేప‌ట్టారు.

భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో గర్భాలయంలో అభివృథుల నిమిత్తం ”బాలాలయం” నిర్వహించారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల దారు (చక్క) విగ్రహాలు ఏర్పాటు చేశారు. సీత రామ లక్ష్మణులకు మహా సంప్రోక్షణ జరుగువరకు నిత్య కైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.30 నుంచి 10. 30 గంటల మధ్య తులా లగ్నంలో బాలాలయ సంప్రోక్షణ శాస్త్రక్తంగా చేప‌ట్టారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవోలు నటేశ్ బాబు, శ్రీమతి ప్రశాంతి, సూపరిండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.