ఛానల్ పై బాల్క సుమన్ ఫిర్యాదు
మాజీ సీఎం కేసీఆర్ పై దుష్ప్రచారం
హైదరాబాద్ – మాజీ ఎమ్మెల్యే బాల్క సుమాన్ సీరియస్ అయ్యారు. ఆయన ఓ ఛానెల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా తమ పార్టీ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్ గురించి వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తుండడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు.
మీడియా పరంగా నియంత్రణ రేఖ అనేది ఉంటుందని, దానిని అతిక్రమించడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఇంకోసారి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేయడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ మేరకు బల్కా సుమన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటీవల లిక్కర్ స్కాంకు సంబంధించిన వార్తలు ప్రచారం చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా పలు ఛానల్స్ కథనాలను ప్రసారం చేశాయని అన్నారు.
మీడియా ఎలాంటి నిర్ధారణ లేకుండా అసత్యాలతో కూడిన వార్త కథనాలను ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు.. ఇకనైనా మీడియా నిర్ధారణ చేసుకొని వార్త కథనాలు ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు.