నందమూరి బాలకృష్ణ అవార్డుపై
కేంద్ర ప్రభుత్వం తనకు అత్యున్నతమైన పద్మభూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు నటుడు నందమూరి బాలకృష్ణ. నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో పాలు పంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు, ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలన చిత్ర రంగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు ,దివంగత సీఎం నందమూరి తారక రామారావు నుండి వారసుడిగా నటిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై తమ విశేష ఆధారాభిమానాలు కురిపిస్తున్న అశేష ప్రేక్షక లోకానికి సదా రుణపడి ఉంటానని అన్నారు. ఈ సందర్భంగా నాతోటి పద్మ అవార్డు గ్రహీతలందరికి అభినందనలు తెలిపారు. తన సినిమా కెరీర్ లో 50 ఏళ్లు పూర్తయ్యాయని, ఈ సమయంలో తనకు పురస్కారం దక్కడం చెప్పలేని సంతోషంగా ఉందన్నారు. తాను ఏనాడూ పదవుల కోసం పాకులాడ లేదన్నారు బాలకృష్ణ.
ఇదిలా ఉండగా కేంద్ర సర్కార్ 139 మంది ప్రముఖకులకు పద్మ పురస్కారాలను ప్రకటించింది. దక్షిణాది నుంచి సినిమా రంగానికి గాను బాలకృష్ణ, అజిత్ కుమార్, శోభన, అనంత్ నాగ్ ఉన్నారు. వీరితో పాటు సింగర్ అర్జిత్ సింగ్ , శేఖర్ కపూర్ కు కూడా పద్మ అవార్డులు వరించాయి.