అమర వీరుల స్థూపానికి శుద్ది
హంతకుడు తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమ సమయంలో పలువురు చావులకు కారణమైన వ్యక్తి తన్నీరు హరీశ్ రావు అంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. శుక్రవారం తన సారథ్యంలో అమర వీరుల స్థూపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హంతకుడైన హరీశ్ రావు కారణంగా ఈ ప్రాంతం మలినమైందని పేర్కొన్నారు. ఈ మేరకు పసుపు నీళ్లతో అమర వీరుల స్థూపాన్ని శుద్ది చేసినట్లు చెప్పారు.
ఉద్యమ పేరుతో నిరుద్యోగులను, యువతను పొట్టన పెట్టుకున్న వ్యక్తి హరీశ్ రావు కాదా అని ప్రశ్నించారు . అలాంటి వ్యక్తి ఇక్కడికి రావడంతో ఈ ప్రాంతం పూర్తిగా మైల పడిందన్నారు. అందుకే పసుపు నీళ్లతో శుద్ది చేసి శుభ్రం చేసినట్లు చెప్పారు బల్మూరి వెంకట్.
గత 10 ఏళ్ల పాలనా కాలంలో ఒక్కసారైనా అమర వీరుల స్థూపాన్ని సందర్శించారా అని నిలదీశారు. హరీశ్ రావు అనేటోడు బీఆర్ఎస్ లో ఒక జీతగాడు అంటూ సంచలన కామెంట్స్ చేశారు. తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడంపై మండిపడ్డారు. ఆగస్టు 15 లోపు రైతుల రుణాలు మాఫీ చేసి తీరుతామన్నారు.
హరీశ్ రావు తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇక చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిదని హితవు పలికారు.