సీజేఐ వ్యవహారం న్యాయవాది ఆగ్రహం
ఆయన కూడా గగోయ్ లాగా మారి పోయాడా
ఢిల్లీ – సుప్రీంకోర్టు న్యాయవాది బాల్ రాజ్ ఎస్ మాలిక్ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గణేశ్ చవితి సందర్బంగా ఎలా ప్రధాన మంత్రి మోడీని తన ఇంటికి ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారం. ఇలాంటి చర్యలు దేశానికి హాని కల్పిస్తాయే తప్పా మేలు చేకూర్చవని పేర్కొన్నారు న్యాయవాది బాల్ రాజ్ ఎస్ మాలిక్.
జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా గగోయ్ లాగా మారి పోయాడా అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిగట్టుకుని భారత దేశ న్యాయ వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. ఈ సమయంలో సీజేఐ ఎలా పీఎంను పిలుస్తారంటూ ప్రశ్నించారు.
సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ తరపున, చంద్రచూడ్ జీపై దేశానికి విశ్వాసం లేనందున, ఆయనను సుప్రీంకోర్టు మాస్టర్ ఆఫ్ రోస్టర్ నుండి తొలగించాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏడాదికి పైగా మణిపూర్ మండుతోందని, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, ప్రజలకు న్యాయం జరగడం లేదన్నారు. వారిపై కేసులు నమోదు కాక పోవడం దారుణమన్నారు. కానీ సీజేఐ పూజలతో బిజీగా ఉండడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
రోమ్ కాలిపోతున్నట్లు , నీరో ఫ్లూట్ వాయిస్తున్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు బాల్ రాజ్ ఎస్ మాలిక్. చంద్రచూడ్ దేశం మొత్తం ముందు దీనిపై స్పష్టత ఇవ్వాలి, లేదంటే రాజీనామా చేయాలని అన్నారు.