హరీశ్ రావుకు బండి బంపర్ ఆఫర్
బీజేపీ ఎంపీ సంజయ్ కామెంట్
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ తను సీఎం కావాలని కోరిక ఉంటే తమ వద్దకు రావాలని సూచించారు. హరీశ్ రావును చేర్చుకునేందుకు బీజేపీ సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
తమ పార్టీ లోకి ఎవరైనా రావచ్చని, హరీశ్ రావుకు రాజకీయ పరంగా మంచి పట్టు, అనుభవం ఉందన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్. ఇలాంటి నాయకులే తమ పార్టీకి అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ఎలాంటి భేషజాలు లేకుండా మంచి భవిష్యత్తు కల్పించే కాషాయ దళంలోకి చేరాలని పిలుపునిచ్చారు.
ఇలాంటి ఆఫర్ ను గతంలో ఎవరూ ఏ పార్టీ హరీశ్ రావుకు ఇచ్చి ఉండదన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనై పోయిందని, ఇక హరీశ్ కు ఎలాంటి పదవులు రావని, వెంటనే తనతో వస్తే పార్టీలోకి చేర్చుకునేలా చేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు బండి.