నా ఆస్తుల మీద విచారణకు సిద్దం
కాంగ్రెస్..బీఆర్ఎస్ పార్టీలకు సవాల్
కరీంనగర్ జిల్లా – భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ , భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నాయకులు దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని అన్నారు.
బండి సంజయ్ కుమార్ పటేల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. నాకు సంబంధించిన ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, దీనికి తాను రెడీగా ఉన్నానని ప్రకటించారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం అలవాటుగా మారిందని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
అవినీతి, అక్రమాలకు పెట్టింది పేరు ఈ రెండు పార్టీలంటూ ఆరోపించారు బండి సంజయ్ కుమార్ పటేల్.
నా ఆస్తుల మీద సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణకు నేను సిద్ధం..
తప్పుడు ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మీరు సిద్ధమా?
ఈ సవాల్ స్వీకరించే దమ్ముంటే అప్పుడు విమర్శలు, రాజకీయాలు చేయండి.