NEWSTELANGANA

బండి చాయ్ పే చ‌ర్చా

Share it with your family & friends

జ‌నంతో సంజ‌య్ ముచ్చ‌ట‌

క‌రీంన‌గ‌ర్ జిల్లా – భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, క‌రీంన‌గ‌ర్ లోక్ స‌భ బీజేపీ అభ్య‌ర్థి బండి సంజ‌య్ కుమార్ పటేల్ వైర‌ల్ గా మారారు. ఆయ‌న తాను ఎంపీ అయినా ఎలాంటి భేష‌జాల‌కు పోకుండా పిలిస్తే ప‌లికే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు.

నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ వారికి భ‌రోసా ఇస్తూ ముందుకు వెళుతున్నారు. దీంతో ఈసారి ఎన్నిక‌ల్లో సైతం బండి సంజ‌య్ కుమార్ కు ఎదురే లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. బ‌రిలో ఎంద‌రు ఉన్నా చివ‌ర‌కు అంతిమ విజ‌యం మాత్రం తన‌దేనంటూ ఇప్ప‌టికే బ‌హిరంగంగానే, ప్ర‌జ‌ల సాక్షిగా ప్ర‌క‌టించారు .

ప్ర‌ధానంగా రాష్ట్రంలో క‌రీంన‌గ‌ర్ జిల్లాకు ఢోకా లేద‌ని ఇప్ప‌టికే భార‌తీయ జ‌న‌తా పార్టీ హై క‌మాండ్ ప‌క్కా న‌మ్మ‌కంతో ఉంది. ఇదిలా ఉండ‌గా బండి సంజ‌య్ కుమార్ చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఎన్నిక‌లు ముగిశాయి. పోలింగ్ పూర్త‌యింది. ఇక ఫ‌లితాలు మాత్ర‌మే రావాల్సి ఉంది.

ఇదిలా ఉండ‌గా తాను కూడా సామాన్యుడినేనంటూ స్కూటీ మీద కొడుకుతో క‌లిసి బేక‌రీకి వెళ్లారు. ఇవాళ క‌రీంన‌గ‌ర్ ప్ర‌జ‌ల‌తో క‌లిసి చాయ్ తాగుతూ ఉత్తేజ ప‌రిచారు బండి సంజ‌య్. ఎంతైనా ప్ర‌జా నేత క‌దూ.