NEWSTELANGANA

జ‌న‌మే జెండా స‌మ‌స్య‌లే ఎజెండా

Share it with your family & friends

సిట్టింగ్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్

క‌రీంన‌గ‌ర్ జిల్లా – భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, క‌రీంన‌గ‌ర్ సిట్టింగ్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ప్ర‌జ‌ల కోసం నిల‌బ‌డ్డాన‌ని స్ప‌ష్టం చేశారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొని ప్ర‌సంగించారు.

తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల కోసమే నిల‌బ‌డ్డాన‌ని అన్నారు. జైలుకు పోయినా జ‌నం మాట త‌ప్ప‌లేద‌న్నారు. తాజాగా బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ చేసిన కామెంట్స్ పై భ‌గ్గుమ‌న్నారు. నిన్న‌టి దాకా సోయి లేకుండా ఉన్న‌ది ఎవ‌రో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు.

ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా స‌రే ప్ర‌జ‌ల ప‌క్క‌నే ఉన్నాన‌ని పేర్కొన్నారు బండి సంజ‌య్ కుమార్. త‌న ప్ర‌జ‌ల కోసం లాభీ దెబ్బ‌లు కూడా తిన్నాన‌ని చెప్పారు. నా వాళ్ల జోలికి వ‌స్తే లాగులు త‌డిసేలా తాను ఉరికించాన‌ని గుర్తు చేశారు.

ప్ర‌తి నిత్యం ప్ర‌జ‌ల కోసం ప‌ని చేశాన‌ని, చేస్తూనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. కొన ఊపిరి ఉన్నంత దాకా యుద్దం చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. జ‌నం మాట మ‌రువ‌ను..జ‌నం బాట వీడ‌న‌ని చెప్పారు బీజేపీ సిట్టింగ్ ఎంపీ. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.