NEWSANDHRA PRADESH

కేబినెట్ లోకి బండి..కిష‌న్ కు ఛాన్స్

Share it with your family & friends

పీఎంఓ నుంచి ఫోన్ కాల్స్

హైద‌రాబాద్ – ఎన్డీయే – భార‌తీయ జ‌న‌తా పార్టీతో కూడిన సంకీర్ణ స‌ర్కార్ ఆదివారం కొలువు తీర‌నుంది. ఇందులో భాగంగా ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర దామోద‌ర దాస్ మోడీ ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

కొత్త‌గా కేబినెట్ లోకి ఎవ‌రిని తీసుకుంటార‌నే దానిపై చ‌ర్చోప చర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతానికి తొలి విడ‌త‌గా 20 మందికి అవ‌కాశం ద‌క్క‌నున్న‌ట్లు స‌మాచారం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుంచి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ తో పాటు రామ్మోహ‌న్ నాయుడుకు చోటు ల‌భించ‌నుంది.

ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి ఈసారి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో భారీ ఎత్తున ఆద‌ర‌ణ ల‌భించింది భార‌తీయ జ‌న‌తా పార్టీకి. గ‌ణ‌నీయంగా ఓటు శాతం పెరిగింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , మాజీ స్టేట్ చీఫ్ , క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ తో పాటు ప్ర‌స్తుత పార్టీ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిష‌న్ రెడ్డికి మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించ‌నుంది.

బండి సంజ‌య్ కుమార్ , కిష‌న్ రెడ్డికి పీఎంఓ నుంచి ఫోన్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.