నేలమ్మా నీకు వందనాలమ్మా
కేంద్ర మంత్రిగా స్వస్థలానికి రాక
కరీంనగర్ జిల్లా – భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలనంగా మారారు. తాజాగా కొలువు తీరిన మోడీ కేబినెట్ లో ఆయనకు అనూహ్యంగా చోటు దక్కింది. విచిత్రం ఏమిటంటే అత్యంత కీలకమైన శాఖను అప్పగించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొలువు తీరారు బండి సంజయ్ కుమార్ . మంత్రిగా కొలువు తీరాక తొలిసారిగా ఆయన అధికారిక హోదాలో తన స్వస్థలమైన కరీంనగర్ జిల్లాకు విచ్చేశారు. భారీ ఎత్తున కాన్యాయ్ బండి వెంట వచ్చింది.
అయితే తను కరీంనగర్ కు వచ్చిన వెంటనే వాహనాం దిగారు. ఆపై తనను అక్కున చేర్చుకుని, అద్భుత విజయాన్ని కట్టబెట్టినందుకు గాను ప్రేమ పూర్వకంగా మట్టిని ముద్దాడారు. ఈ మేరకు ఈ నేలకు తల వంచి నమస్కారం చేశారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఒక సామాన్యమైన కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి పదవి వరకు ఎదిగిన బండిని ప్రతి ఒక్కరు అభినందనలతో ముంచెత్తుతున్నారు.