బన్నీ అరెస్ట్ పై భగ్గుమన్న బండి
ముమ్మాటికీ సర్కారు బాధ్యత వహించాలి
హైదరాబాద్ – సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రభుత్వం చేతకాని తనాన్ని కప్పి పుచ్చుకునేందుకే తనను అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు. బెనిఫిట్ షోకు హీరో , హీరోయిన్ వస్తున్నాడని తెలిసి ఎందుకు సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు బండి.
ఇదిలా ఉండగా ఒక బాధ్యత కలిగిన కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ ప్రజల సమస్యల గురించి ప్రశ్నించాల్సింది పోయి ఇలా బన్నీని వెనకేసుకు రావడం ఎంత వరకు సబబు అని తెలంగాణ సమాజం నిలదీస్తోంది.
సినిమా రంగానికి చెందిన వాళ్లు ఎవరూ తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల కానీ, అభివృద్ది, సంస్కృతి పట్ల సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎంత సేపు ఓట్ల కోసం సినిమా వాళ్లకు గాలం వేయడం తప్పితే వారి నుంచి ఒరిగింది ఏముందంటూ ప్రశ్నిస్తోంది.