NEWSTELANGANA

ద‌మ్ముంటే నిరూపించండి – బండి

Share it with your family & friends

చొప్పదండికి రూ. 750 కోట్లు

క‌రీంన‌గ‌ర్ జిల్లా – భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ చీఫ్‌, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ నిప్పులు చెరిగారు. త‌న హ‌యాంలో కోట్లాది రూపాయ‌లు లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి తీసుకు రావ‌డం జ‌రిగింద‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా విజ‌య్ సంక‌ల్ప్ యాత్ర చేప‌ట్టారు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ దేశంలో మోదీ నాయ‌క‌త్వం ప‌ట్ల సానుకూల‌త ఉంద‌న్నారు. త‌మ‌కు ఈసారి జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో క‌నీసం 400కు పైగా ఎంపీ సీట్లు వ‌స్తాయ‌ని ధీమా వ్య‌క్తం చేశారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

కేంద్ర స‌ర్కార్ కు తాను నిధులు ఇవ్వాల‌ని కోరుతూ ప‌లు మార్లు విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఆదేశాల మేర‌కు ఒక్క చొప్ప‌దండి నియోజ‌క‌వ‌ర్గానికి రూ. 750 కోట్ల‌కు పైగానే నిధులు మంజూరు చేసింద‌ని స్ప‌ష్టం చేశారు. ఏ ప‌థ‌కానికి ఎంతెంత ఇచ్చింద‌నే దానికి సంబంధించి పూర్తి వివ‌రాలు ఉన్నాయ‌ని చెప్పారు.

ద‌మ్ముంటే తాను నిధులు తీసుకు రాలేద‌ని ప‌దే ప‌దే విమ‌ర్శిస్తున్న వారికి ద‌మ్ముంటే బ‌హిరంగంగా చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.