రాముని పేరుతో రాజకీయాలు చేస్తాం
బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ కుమార్
కరీంనగర్ జిల్లా – భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. తాము బరా బర్ రాముని పేరుతో రాజకీయాలు చేస్తామని ప్రకటించారు. ఇందులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు.
భారత రాజ్యాంగ ప్రకారం ఒక ప్రజా ప్రతినిధి ఇలా బహిరంగంగా రాముడి పేరుతో రాజకీయాలు చేయాలని చెప్పడం పూర్తిగా విరుద్దం. రోజు రోజుకు మతం పేరుతో రాజకీయాలు చేస్తామని బహిరంగంగా ప్రకటించడం దారుణమని పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే బాబర్ పేరుతో ప్రజల్లోకి వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్ పటేల్. రాబోయే రోజుల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను సాధించడం ఖాయమన్నారు.
కాంగ్రెస్ తో కూడిన కూటమికి కనీసం 40 సీట్లకు తక్కువ వస్తాయని జోష్యం చెప్పారు బండి సంజయ్ కుమార్ పటేల్. దేశంలో సుస్థిరమైన పాలనను అందిస్తున్న ఘనత మోదీకి మాత్రమే దక్కుతుందన్నారు.