అన్నయ్యకు నేను వీరాభిమానిని
సంతోషం వ్యక్తం చేసిన బండి
హైదరాబాద్ – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొలువు తీరిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లో ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలుసుకున్నారు.
ఈ సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కు సాదర స్వాగతం పలికారు మెగాస్టార్. బండికి శాలువా కప్పారు. అనంతరం పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా ఇరువురు చాలా సేపు ముచ్చటించారు. పలు అంశాలపై చర్చించారు.
మెగాస్టార్ సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన భారీ మెజారిటీ సాధించడమే కాకుండా మోడీ ప్రశంసలు పొందారు. చిరంజీవిని కలుసుకన్న అనంతరం బండి సంజయ్ కుమార్ ఫోటోలు చేశారు.
మెగాస్టార్ అన్నయ్యను కలవడం చెప్పలేనంత ఆనందంగా ఉందన్నారు. శ్రేయోభిలాషి, వినయ పూర్వకమైన వ్యక్తి అని కొనియాడారు. విద్యార్థి దశలో తాను ఆయనకు వీరాభిమానినని అన్నారు బండి సంజయ్ కుమార్.