NEWSTELANGANA

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ తో బండి భేటీ

Share it with your family & friends

క‌రీంన‌గ‌ర్ హ‌స‌న్ ప‌ర్తి రైల్వే లైన్ ప‌నుల‌కు

న్యూఢిల్లీ – కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ మంగ‌ళ‌వారం మ‌ర్యాద పూర్వ‌కంగా ఢిల్లీలోని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ తో భేటీ అయ్యారు. త‌మ ప్రాంతంలో చోటు చేసుకున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ లేఖ అంద‌జేశారు.

ఇదిలా ఉండ‌గా కరీంనగర్-హసన్ పర్తి రైల్వే లైన్ డీపీఆర్ సిద్ధమైంద‌ని తెలిపారు. దీనికి సంబంధించి పనులకు అనుమతి ఇవ్వాలని కోరారు కేంద్ర మంత్రిని. ఈ సంద‌ర్బంగా సానుకూలంగా స్పందించార‌ని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

క‌రీంన‌గర్ – హ‌స‌న్ ప‌ర్తి రైల్వే లైన్ ప‌నులు పూర్త‌యితే ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని, ఇక్క‌డి నుంచి ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లేందుకు మార్గం ఏర్ప‌డుతుంద‌న్నారు. ఈ ప‌నులను ప్రారంభించేలా త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణ‌వ్ తో.

కేంద్ర బ‌డ్జెట్ లో రైల్వే ల‌కు పెద్ద ఎత్తున కేటాయింపులు జ‌రిగాయని, ఈ మేర‌కు వెంట‌నే తమ‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని కోరారు బండి సంజ‌య్ కుమార్. ఈ సంద‌ర్బంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు పెద్ద ఎత్తున హ‌ర్షం వ్య‌క్తం చేశారు. బండి సంజ‌య్ తీసుకుంటున్న చొర‌వ అభినంద‌నీయ‌మ‌ని పేర్కొన్నారు.