కాషాయం గెలుపు ఖాయం
బండి సంజయ్ ..రాజా సింగ్
కరీంనగర్ జిల్లా – దేశంలో మోదీ గాలి వీస్తోందని మోదీ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదని అన్నారు సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పటేల్ , ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భారీ ఎత్తున రోడ్ షో చేపట్టారు.
కరీంనగరం పూర్తిగా కాషాయమయం అయి పోయింది. చివరి రోజు ఎన్నికల ప్రచారానికి తెర పడడంతో బైక్ ర్యాలీ చేపట్టారు. పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. ఈసారి కూడా బీజేపీ విజయాన్ని అడ్డుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి , భారత రాష్ట్ర సమితి పార్టీలకు లేదన్నారు బండి సంజయ్ , రాజా సింగ్.
ఎంపీ బండి సంజయ్ కుమార్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు టైగర్ రాజా సింగ్. ఇదిలా ఉండగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. కరీంనగర్ కు వచ్చి మత చిచ్చు పెట్టిండు. ముస్లింలంతా ఒక్కటై నన్ను ఓడించాలని పిలుపు ఇచ్చాడని కానీ తానే గెలిచానని అన్నారు.
హిందువులంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. మీరంతా నా వెంట ఉన్నారనే ధైర్యంతోనే గల్లీగల్లీలో తిరిగి మీకోసం పోరాడుతున్నానని చెప్పారు. మీరే నా ధైర్యం… మీరే నా ఆశ… మీరే నా శ్వాస…నా పోరాటానికి అండ దండ మీరేనని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్.