NEWSTELANGANA

ఫిర్ ఏక్ బార్ మోదీ స‌ర్కార్

Share it with your family & friends

ఎంపీ బండి సంజ‌య్ కుమార్

క‌రీంన‌గ‌ర్ జిల్లా – ఈ దేశంలో మ‌రోసారి భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ కొలువు తీర బోతోంద‌ని స్ప‌ష్టం చేశారు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సిట్టింగ్ ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. దేశంలోని 143 కోట్ల మంది భార‌తీయులంతా ముక్త కంఠంతో ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోదీ కావాల‌ని కోరుకుంటున్నార‌ని చెప్పారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ప‌ర్య‌టించారు. ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ది కోసం వేల కోట్ల రూపాయ‌లు కేంద్రం మంజూరు చేసింద‌ని చెప్పారు. కానీ కాంగ్రెస్ స‌ర్కార్ క‌ళ్లున్న క‌బోధి లాగా మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు.

బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌లు హిందువుల మ‌నోభావాల‌ను కించ ప‌ర్చేలా ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మితి మీరిన ఆత్మ విశ్వాసంతో విర్ర వీగిన దొర‌కు తెలంగాణ ప్ర‌జ‌లు త‌గిన రీతిలో గుణ‌పాఠం చెప్పార‌ని, అయినా బుద్ది రాలేద‌న్నారు బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్.

రాష్ట్రంలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు ప్ర‌జ‌ల‌ను మోసం చేసే ప‌నిలో ప‌డ్డాయ‌ని, ఆరు గ్యారెంటీలు స‌రే ఎక్క‌డ అమ‌లు చేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.