టీఎస్పీఎస్సీపై బండి ఫైర్
అధికారుల తీరుపై ఆగ్రహం
అమరావతి – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు. శుక్రవారం స్త్రీ శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ -1 ఈవో ఉద్యోగాల భర్తీకి సంబంధించి జరుగుతున్న జాప్యాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
పరీక్ష రాసి ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థినులు కేంద్ర మంత్రిని కలిశారు. ఈ సందర్బంగా తమకు న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. 2022లో నోటిఫికేషన్ విడుదలైందని, ఇప్పటికీ నియామకాలు చేపట్ట లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు జాప్యం జరుగుతుందో తెలియడం లేదని వాపోయారు .
వెంటనే నియామకాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ పట్టించు కోవడం లేదని మండిపడ్డారు. ఈ సందర్బంగా బాధిత మహిళలకు బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. వెంటనే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.