NEWSTELANGANA

బండి సంజ‌య్ షాకింగ్ కామెంట్స్

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్స్

హైద‌రాబాద్ – కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎంను ఉద్దేశించి సెటైర్స్ వేశారు. మ‌హారాష్ట్ర‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. ఈ సంద‌ర్బంగా ఇక్క‌డ ఎన్డీయే కూట‌మి ఏకంగా 220 సీట్ల‌కు పైగా కైవ‌సం చేసుకుంది.

ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన ప్ర‌చారంలో సీఎం అనుముల రేవంత్ రెడ్డి పాల్గొన్న ఏ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇండియా కూట‌మి అభ్య‌ర్థులు గెలుపొంద లేద‌ని అన్నారు. క‌ర్ణాట‌క‌, తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేత‌లు ప్ర‌చారం చేసిన చోట ఎన్డీయే జెండా ఎగుర వేసింద‌ని చెప్పారు బండి సంజ‌య్ కుమార్.

మ‌రాఠా ప్ర‌జ‌లు కాంగ్రెస్ నేత‌లు చెప్పిన మాట‌ల‌ను విశ్వ‌సించ లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డితో పాటు ఎంపీ చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు మేఘా రెడ్డి, మ‌ధుసూద‌న్ రెడ్డితో పాటు ఇంఛార్జిగా పాల‌మూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా పోటీ చేసి ఓట‌మి పాలైన వంశీ చంద‌ర్ రెడ్డి కూడా ఉన్నారు.