బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
ఓవైసీలకు..ఉగ్రవాదులకు సంబంధాలు
హైదరాబాద్ – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ కేసు విచారణ ఎందాక వచ్చిందంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఎందుకు విచారణ చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు.
ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఇదే సమయంలో ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్న ఓవైసీ సోదరులను కూడా వదల లేదు బండి సంజయ్ కుమార్.
ఓవైసీలకు, ఎంఐఎంకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయంటూ సంచలన కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి. ఓవైసీకి చెందిన కళాశాలలో ఓ ఫ్యాకల్టీ ఉగ్రవాది ఉన్నాడని ఆరోపించారు. ఓవైసీల ఉగ్ర వాదులతో ఉన్న సంబంధాలకు సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్.
తాజాగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్, ఎంఐఎంలో.