నిప్పులు చెరిగిన బండి సంజయ్
హైదరాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2025-26పై సీరియస్ గా స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆరు గ్యారెంటీలపై ఆశలు వదులుకునేలా బడ్జెట్ ఉందన్నారు. కేటాయింపులకు, ఆచరణకు పొంతనే లేదన్నారు. 10 శాతం హామీలు కూడా అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అంటూ ఎద్దేవా చేశారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారని, కానీ ఇప్పటి వరకు ఎన్ని భర్తీ చేశారో చెప్ప లేదన్నారు. రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఊసే లేదన్నారు కేంద్ర మంత్రి.
ఇదిలా ఉండగా మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. దీనిపై సీరియస్ గా స్పందించారు . ఈ బడ్జెట్ ఢిల్లీకి మూటలు పంపించేందుకు ఉపయోగపడేలా ఉందంటూ ఆరోపణలు చేశారు. పదేళ్ల రథ చక్రానికి పంక్షర్ వేశారంటూ ఎద్దేవా చేశారు. రూ. లక్షల కోట్ల అప్పునకు టార్గెట్ పెట్టారంటూ ఫైర్ అయ్యారు. రూ. 6 వేల కోట్లు పార్టీ కార్యకర్తలకు పంచి పెడతారా అని ప్రశ్నించారు. యువ వికాసం కాదు కాంగ్రెస్ వికాసమన్నారు.