కాంగ్రెస్ సర్కార్ పై బండి కన్నెర్ర
రాత్రిపూట యువతుల అరెస్ట్ పై ఫైర్
హైదరాబాద్ – కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వంపై. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ మొహబ్బత్ కీ దుకాణ్ అంటూ ప్రచారం చేస్తున్నాడని, మరో వైపు తెలంగాణలో ఇక్కడ అందుకు పూర్తిగా భిన్నంగా ఉందన్నారు.
ఇక్కడ నఫ్రత్ కా బజార్ గా మారుతోందని మండిపడ్డారు బండి సంజయ్ కుమార్. రాత్రిపూట యువతులను అరెస్ట్ చేస్తే ఎలా, ఇంత ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటూ ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ఉద్యోగాలకు సంబంధించి న్యాయ పరమైన కోర్కెలను కోరడం, తమ ఆందోళనను చేపట్టడం వారి హక్కు అని స్పష్టం చేశారు. కానీ పోలీసులు ఇలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్ కుమార్.
అమానవీయంగా లాగడం, కొట్టడం దారుణమన్నారు . రోజు రోజుకు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోతోందన్నారు. జీవో 29పైన మీ వైఖరి ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టు మీకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే ఎలా పరీక్షను చేపడతారంటూ నిలదీశారు బండి సంజయ్ కుమార్.