రేణుక ఎల్లమ్మ తల్లీ కరుణించు
వేడుకున్న బండి సంజయ్ కుమార్
కరీంనగర్ జిల్లా – భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్, ప్రస్తుత కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్ వైరల్ గా మారారు. శివరాత్రి పండుగను పురస్కరించుని బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా పూజారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆశీర్వచనాలు అందించారు. అమ్మ వారి తీర్థ ప్రసాదాలను ఎంపీకి అందజేశారు.
ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఎంపీకి తమ సమస్యల గురించి విన్నవించింది. ఆలయం పక్కనే డంప్ యార్డు ఉందని , దీనిని ఇతర ప్రాంతాలకు తరలించాలని కోరారు కమిటీ సభ్యులు. వారి వినతిని స్వీకరించిన ఎంపీ బండి సంజయ్ పూర్తి హామీ ఇచ్చారు. వెంటనే అమ్మ వారి పక్కనే ఉన్న డంప్ యార్డును తొలగించేందుకు కృషి చేస్తానని అన్నారు.
అంతే కాకుండా ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యం కోసం షెడ్లు నిర్మించేందుకు సాయం చేయాలని కమిటీ కోరింది. దీనికి సమ్మతించారు ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్. ఈ మేరకు ఎంపీ నిధుల నుండి తక్షణమే రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా ఎంపీకి ధన్యవాదాలు తెలిపింది ఆలయ కమిటీ.