17 ఎంపీ సీట్లు మావే – బండి
జోష్యం చెప్పిన ఎంపీ
హైదరాబాద్ – కరీంనగర్ ఎంపీ , భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే 17 ఎంపీ సీట్లలో క్లీన్ స్విప్ చేస్తామని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీకి మెరుగైన సీట్లు వచ్చాయని, గతంలో కంటే ఈసారి ఓటు శాతం కూడా పెరిగిందన్నారు. ఇది పార్టీకి శుభ సూచకమని పేర్కొన్నారు బండి సంజయ్ .
ప్రస్తుతం ఎంపీ సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పార్టీ ఉందన్నారు. ఇప్పుడున్న వాతావరణం బట్టి, సర్వే చూస్తే తమకే అన్ని సీట్లు దక్కుతాయని పేర్కొన్నారు. హైకమాండ్ గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తుందన్నారు.
పార్టీకి ఢోకా లేదన్నారు. ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీకి , దాని అనుబంధ పార్టీలకు కనీసం గతంలో కంటే ఎక్కువగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్ కుమార్. త పార్టీకి కనీసం 400 సీట్లకు పైగా వస్తాయన్నారు.