మోదీ నాయకత్వం అభివృద్దికి సోపానం
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్
కరీంనగర్ జిల్లా – ఈ దేశంలో అత్యంత సమర్థవంతమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనేనని స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్ కుమార్ పటేల్. విజయ సంకల్ప యాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. హుజూరాబాద్ లో ఈ యాత్ర కొనసాగింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్ .
యావత్ ప్రపంచం మొత్తం మోదీ వైపు చూస్తోందన్నారు. ఆయన చరిష్మాకు మిగతా నేతలు ఎవరూ తట్టుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. ఇవాళ 143 కోట్ల మంది భారతీయులు సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని, అది కేవలం బీజేపీ వల్లనే సాధ్యమవుతుందన్న విషయం గుర్తించారని అన్నారు.
రహదారుల అభివృద్దికి తమ సర్కార్ ప్రయారిటీ ఇచ్చిందన్నారు. ఉపాధి హామీ పథకం , పేదలకు ఇళ్లు, రైతులకు బీమా సదుపాయం , యువతకు ఎంఎస్ఎంఈ కింద రుణాలు ఇవ్వడం జరిగిందన్నారు సంజయ్ కుమార్ పటేల్.
ఇవాళ అభివృద్ది అన్నది జరిగింది అంటే కేవలం ఒక్క మోదీ పీఎంగా ఉండడం వల్లనే సాధ్యమైందన్న వాస్తవం గుర్తించాలని సూచించారు ఎంపీ.