కాంగ్రెస్ సర్కార్ కు బండి సంజయ్ వార్నింగ్
హైదరాబాద్ – కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కార్ పై మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పై భగ్గుమన్నారు. పొట్టి శ్రీరాములు పేరు మార్చాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. ఆయన గొప్ప దేశ భక్తుడని, స్వాతంత్ర సమర యోధుడని అన్నారు. ఆయన బలిదానం వల్లనే భాషా ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. హరిజనోద్దరణ ఉద్యమం చేశారనే సంగతి మర్చి పోయారా అంటూ మండిపడ్డారు. ఆంధ్రా మూలాలు ఉంటే పేర్లు మార్చేస్తారా అని ఫైర్ అయ్యారు. అయితే ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను కూడా మార్చే దమ్ముందా అంఊట నిలదీశారు.
ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ట్యాంక్ బండ్ పై ఉన్న ఆంధ్రుల విగ్రహాలను తొలగించే దమ్ముందా నీకు అంటూ సీఎం రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు . తక్షణమే చేసిన తప్పును సరిదిద్దు కోవాలని హితవు పలికారు. దేశభక్తులు, ఆర్య వైశ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ కుమార్. ఇవాళ పొట్టి శ్రీరాములు జయంతి సందర్బంగా కరీంనగర్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా పొట్టి శ్రీరామలు పేరును తొలగించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రిని కలిశారు ఆర్యవైశ్య సంఘం సభ్యులు.