నిప్పులు చెరిగిన బండి సంజయ్
హైదరాబాద్ – కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు 50 శాతానికి మించి ఇవ్వకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు.
కానీ ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. ఏ మాత్రం చర్యలు తీసుకున్నా అడ్డుకుని తీరుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే చేపట్టింది. దాదాపు 3 కోట్ల 80 లక్షలకు పైగా జనాభా ఉన్నట్లు తేల్చింది. ఇదే సమయంలో బీసీలకు సంబంధించి కుల గణన సరిగా చేపట్టలేదన్న అపవాదు మూటగట్టుకుంది.
బహుజన, బీసీ సంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. సర్కార్ కు, సీఎంకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో గత్యంతరం లేక దిగి వచ్చింది ప్రభుత్వం. తిరిగి రీ సర్వే చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రూ. 160 కోట్లకు పైగా తగిలేశారు.