తెలంగాణలో హిందువులకు రక్షణేది
నిప్పులు చెరిగిన బండి సంజయ్ కుమార్
కరీంనగర్ జిల్లా – తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ మాజీ చీఫ్, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్. ప్రజా పాలన సాగిస్తామంటూ ప్రజల చెవుల్లో పూలు పెట్టారంటూ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు ఎంపీ.
పండుగలను జరుపు కోవడం అనాది నుంచి జరుగుతూ వస్తోందని, ఇందులో భాగంగా హోళీ పండగను జరుపుకుంటున్న వారిపై పనిగట్టుకుని ఎలా దాడులకు పాల్పడతారంటూ ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని నిలదీశారు. హిందువులు పండుగలు జరుపు కోకూడదా అని ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనలు ఇంకోసారి పనరావృతం కాకుండా చూడాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ మొత్తం ఘటనపై పూర్తి బాధ్యత సీఎం సర్కార్ వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్. ఇకనైనా ఖాకీలు కంట్రోల్ లో ఉండాలని సూచించారు ఎంపీ.