NEWSTELANGANA

కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ – బండి

Share it with your family & friends

రైతుల‌కు న‌ష్ట ప‌రిహారం మాటేంటి

క‌రీంన‌గ‌ర్ జిల్లా – సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు ఎంపీ , బీజేపీ మాజీ చీఫ్ బండి సంజ‌య్ కుమార్ . ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ ఎందుక‌ని రైతుల‌ను ప‌ట్టించు కోవ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

సీఎం స‌మీక్ష‌ల పేరుతో కాల‌యాప‌న చేస్తున్నారే త‌ప్పా రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు చొర‌వ చూప‌డం లేద‌ని ఆరోపించారు. ఎన్నిక‌ల‌లో ఎలా గెల‌వాల‌న్న త‌లంపు త‌ప్ప రైతులు పంటలు కోల్పోయి నానా ఇబ్బందులు ప‌డుతుంటే ఇటు వైపు చూడ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు బండి సంజ‌య్ కుమార్.

ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త స‌ర్కార్ కొలువు తీరి 3 నెల‌ల‌కు పైగా అవుతోంద‌ని కేవ‌లం 100 రోజుల్లోనే అన్ని హామీలు అమ‌లు చేస్తామ‌న్నారని ఒక్క‌టి కూడా పూర్తి చేయ‌లేక పోయారంటూ మండిప‌డ్డారు బీజేపీ మాజీ చీఫ్, సిట్టింగ్ ఎంపీ . రైతుల‌కు ఇస్తామ‌న్న భీమా ఎక్క‌డుంద‌ని ప్ర‌శ్నించారు. రుణ మాఫీ ఏమైందంటూ నిల‌దీశారు.