NEWSTELANGANA

తెలంగాణ‌లో గూండా రాజ్ స‌ర్కార్

Share it with your family & friends

నిప్పులు చెరిగిన బండి సంజ‌య్

క‌రీంన‌గ‌ర్ జిల్లా – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మ‌ధ్య వార్ కొన‌సాగుతోంది. మాట‌ల యుద్ధం మొద‌లైంది. నువ్వా నేనా అంటూ మాట‌ల తూటాలు పేల్చారు. ఈ సంద‌ర్బంగా క‌రీంన‌గ‌ర్ ఎంపీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీని, స‌ర్కార్ ను ఏకి పారేశారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌న్నారు. త‌మ వారిని నామ రూపాలు లేకుండా చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడంటూ ధ్వ‌జ‌మెత్తారు.

ద‌మ్ము, ధైర్యం ఉంటే పొన్నం ప్ర‌భాక‌ర్ త‌న‌తో ఢీకొనాల‌ని స‌వాల్ విసిరారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో జ‌నాన్ని నిట్ట నిలువునా మోసం చేశారంటూ ఆరోపించారు. ఒక ర‌కంగా రాష్ట్రంలో కాంగ్రెస్ గూండా రాజ్ కొన‌సాగుతోంద‌ని మండిప‌డ్డారు బండి సంజ‌య్.

కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం మాజీ దివంగ‌త ప్ర‌ధాన మంత్రి, దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టిన పాముల‌ప‌ర్తి వెంక‌ట న‌ర‌సింహారావుకు అత్యున్న‌త‌మైన పుర‌స్కారం భార‌త‌ర‌త్న‌ను ప్ర‌క‌టించింద‌న్నారు. కానీ కాంగ్రెస్ దీనిని జీర్ణించుకోల‌క పోతోంద‌ని ఆరోపించారు. అందుకే త‌న‌పై దాడికి పాల్ప‌డ్డారంటూ ధ్వ‌జ‌మెత్తారు బండి సంజ‌య్.