నేరస్తులకు ఖాకీల అండ – బండి
బీజేపీ కార్యకర్తలపై దాడులు ఏలా
హైదరాబాద్ – బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఉప్పల్ లోని చంగిచర్ల ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ కొలువు తీరినా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్.
దాడికి పాల్పడిన వారిపై ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించారు . ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. తాము చూస్తూ ఊరుకోమన్నారు. బీజేపీ కార్యకర్తలను దారుణంగా దాడికి పాల్పడ్డారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి, సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ లు పరామర్శించారని, భరోసా ఇచ్చారని చెప్పారు .
దాడికి గురైన ఆదివాసీ ఆడబిడ్డలకు అండగా నిలిచి రక్షణ కల్పించాల్సిన పోలీసులు దాడి చేసిన మతోన్మాద మూకులను పువ్వుల్లో పెట్టుకుని చూసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్ కుమార్. దాడికి గురైన దళిత, గిరిజన కుటుంబాలపై తప్పుడు కేసులు బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు.