బీజేపీలో బిగ్ ఫైటర్ బండి
కేంద్ర కేబినెట్ లోకి తొలిసారి
కరీంనగర్ జిల్లా – మోడీ కేంద్ర మంత్రివర్గంలో తొలిసారి చోటు దక్కించుకున్నారు బండి సంజయ్ కుమార్ పటేల్. ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా. భారతీయ జనతా పార్టీలో ట్రెండ్ సెట్టర్ గా పేరు పొందారు. తెలంగాణలో బీజేపీకి పూర్వ వైభవాన్ని తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కరీంనగర్ నుంచి 2024లో ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందారు. గతంలోనే కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఊహించని రీతిలో కిషన్ రెడ్డికి ఛాన్స్ లభించింది.
మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కుమార్ పిలిస్తే పలికే నాయకుడిగా గుర్తింపు పొందారు. పలు కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. సాధారణమైన కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. 11 జూలై 1971లో పుట్టారు. బండి సంజయ్ కుమార్ పటేల్ వయసు 52 ఏళ్లు. ఎయిమ్స్ మెంబర్ గా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఫుల్ టైమ్ కార్యకర్తగా ఉన్నాడు. ఏబీవీపీ అధ్యక్షుడిగా పని చేశాడు.
కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు ఇంఛార్జ్ గా ఉన్నాడు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. కానీ ఎంపీగా గెలుపొందాడు. కార్పొరేటర్ గా తొలిసారి గెలుపొందాడు. ప్రస్తుతం అనూహ్యంగా కేంద్ర కేబినెట్ లోకి ఎంటర్ అయ్యాడు.