దేశం మరువని వీరుడు సావర్కర్
జయంతి సందర్బంగా నివాళులు
కరీంనగర్ జిల్లా – భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మే 28న భారత దేశం గర్వించ దగిన గొప్ప నాయకుడు దామోదర్ వీర సావర్కర్ జయంతి అని పేర్కొన్నారు.
మంగళవారం ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. దేశంలో హిందూత్వ జాతీయ వాదాన్ని బలోపేతం చేయడంలో, దానిని మరింత ముందుకు తీసుకు వెళ్లడంలో ఆయన చేసిన కృషి గొప్పదన్నారు. వీర సావర్కర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.
కోట్లాది ప్రజల గుండెల్లో జాతీయతను ప్రేరేపించిన విప్లవ శంఖారావం దామోదర్ అని కొనియాడారు.
సనాతన ధర్మమే జాతి మనుగడకు ఆధారమని నమ్మిన హైందవ నాదం అన్నారు. ఆంగ్లేయులను గడగడలాడించి, వారి గుండెల్లో నిద్రించిన సింహ స్వప్నం..వీర సావర్కర్ అని పేర్కొన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్.
దేశ స్వాతంత్ర పోరాటంలో రెండు సార్లు యావజ్జీవ కఠిన కారాగార శిక్షకు గురైన ఏకైక భారత వీర కిశోరం, వీరసావర్కర్ అని తెలిపారు. ఆయన జయంతిని పురస్కరించుకుని నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.