బండి వాహనం తనిఖీ
సహకరించానన్న ఎంపీ
కరీంనగర్ జిల్లా – దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం తొలి విడత ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో 144 సెక్షన్ అమలవుతోందని పేర్కొంది. ఇదే సమయంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందులో భాగంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు కొనసాగుతోంది. ఎక్కడికక్కడ వాహనాలను తనిఖీ చేసే పనిలో పడ్డారు ఖాకీలు. సోదాలు చేపడుతున్నారు. అనుమానం వచ్చిన వెహికిల్స్ ను నిలిపి వేస్తున్నారు.
తనిఖీలలో భాగంగా భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్, కరీంనగర్ ఎంపీ, ప్రస్తుత అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పటేల్ ను నిలిపి వేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని తనిఖీ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని వెంకట్రావుపల్లె వద్ద నిలిపి వేశారు. ఈ సందర్భంగా తాను ఖాకీలకు సహకరించినట్లు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు పటేల్. ప్రస్తుతం ఇవి హల్ చల్ చేస్తున్నాయి. మొత్తంగా ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు .