NEWSTELANGANA

ప్ర‌మాద బాధితుల‌కు బండి భ‌రోసా

Share it with your family & friends

బీజేపీ ఎంపీ సంజ‌య్ కుమార్

క‌రీంన‌గ‌ర్ జిల్లా – అగ్ని ప్ర‌మాద బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించారు ఎంపీ , బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. సుభాష్ న‌గ‌ర్ లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో గుడిసెలు ద‌గ్ధ‌మ‌య్యాయి. బాధితులు స‌ర్వ‌స్వం కోల్పోయారు. విలువైన వ‌స్తువులు అగ్నికి ఆహుత‌య్యాయి.

క‌ష్ట‌ప‌డి దాచుకున్న బంగారంతో పాటు , ఉపాధి క‌ల్పిస్తున్న యంత్రాలు, వాహ‌నాలు సైతం అగ్ని ప్ర‌మాదంలో ప‌నికి రాకుండా పోయాయ‌ని బాధితులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విష‌యం తెలుసుకున్న ఎంపీ బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ హుటా హుటిన ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు.

బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించారు బండి సంజ‌య్ కుమార్. ఉపాధికి అవ‌స‌ర‌మైన యంత్రాల‌ను, కోల్పోయిన గుడిసెల‌ను మ‌ళ్లీ వేసుకునేందుకు అవ‌స‌ర‌మైన మేర‌కు స‌మ‌కూరుస్తామ‌ని హామీ ఇచ్చారు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.

ఇదిలా ఉండ‌గా బాధితుల‌కు బీజేపీ నిత్యావ‌స‌ర వ‌స్తు సామాగ్రి, ఆహారం అంద‌జేసింది.