రేపటి అమెరికా ప్రెసిడెంట్ కమ్మోడే
షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్
హైదరాబాద్ – సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మోళ్ల గురించి ప్రశంసలు కురిపించారు. వారు గనుక లేక పోతే బతకడం కష్టమన్నారు. ఏపీ, తెలంగాణ అభివృద్దిలోనే కాదు అమెరికా ముందుకు వెళ్లడంలో కూడా కమ్మ వాళ్లు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
ఇక ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికాలో అత్యధికంగా కమ్మ వాళ్లే రాజ్యం ఏళుతున్నారని, ఇక త్వరలోనే అమెరికాకు ప్రెసిడెంట్ కావడం ఖాయమని జోష్యం చెప్పారు బండ్ల గణేష్. కమ్మోళ్లకు మోసం, అన్యాయం చేయడం రాదన్నారు. ఆపదల్లో ఉంటే ఆదుకోవడం మాత్రం ముందుంటారని కొనియాడారు.
కమ్మ వాడిగా పుట్టినందుకు గర్విస్తామని అంతే కాదు సగర్వంగా తల ఎత్తుకుని చెప్పేందుకు మొహమాట పడమని చెప్పారు బండ్ల గణేష్. రవి అస్తమించని ప్రతి దేశంలో కమ్మోడు జెండా ఎగుర వేస్తున్నాడని ప్రకటించారు. కమ్మోళ్ల సంఘంలో రెచ్చి పోయి ప్రసంగించారు మనోడు. మొత్తంగా కమ్మోళ్లు సంఘం పెట్టి..సమావేశం నిర్వహించి ..సీఎంను ఆహ్వానించి హల్ చల్ చేశారు.
అస్తిత్వం కోసం, దోపిడీ పాలన నుంచి విముక్తి కోసం ఉద్యమించిన తెలంగాణ గడ్డపై మరోసారి కమ్మ వాయిస్ గట్టిగా వినిపించడం విస్తు పోయేలా చేస్తోంది.