SPORTS

బంగ్లా క్రికెట‌ర్ల‌కు బిగ్ షాక్

Share it with your family & friends

ఐపీఎల్ వేలం పాట‌లో ఝ‌ల‌క్

బంగ్లాదేశ్ – సౌదీ అరేబియా లోని జెడ్డా వేదిక‌గా జ‌రిగిన ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025కి సంబంధించి పూర్త‌యింది. భారీ ఎత్తున ఖ‌ర్చు చేశాయి ఆయా జ‌ట్ల‌కు చెందిన ఫ్రాంచైజీలు. మొత్తం 183 ఆట‌గాళ్ల‌ను ఏకంగా 659.95 కోట్ల‌కు తీసుకున్నాయి.

భారీ ఎత్తున వేలం పాట‌లోకి ప్ర‌పంచంలోని ప‌లువురు కీల‌క‌మైన ఆట‌గాళ్లు వ‌చ్చారు. విచిత్రం ఏమిటంటే 2025 వేలంలో ఒక్క బంగ్లాదేశ్ క్రికెట‌ర్ ను కూడా ఫ్రాంచైజీలు కొనుగోలు చేయ‌లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏమిటంటే బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్న హిందువుల‌పై జ‌రిగిన హింసాకాండ‌ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ఆదేశించిన‌ట్లు స‌మాచారం.

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరిగిన హింసాకాండ మధ్య బంగ్లాదేశ్ క్రికెటర్లు కొనుగోలు చేయలేద‌ని పేర్కొంది. ఇదే విష‌యాన్ని బంగ్లాదేశీయులు పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు బీసీసీఐపై. కావాల‌నే త‌మ ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయ‌లేదంటూ వాపోయారు. దీనికి ప్రధాన కార‌ణం అమిత్ చంద్ర షా, జే షాలేనంటూ మండిప‌డ్డారు.