దాడులపై గుస్సా సర్కార్ పై కన్నెర్ర
తక్షణమే హింసను ఆపాలని పోరాటం
బంగ్లాదేశ్ – బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మైనార్టీలుగా ఉన్న హిందువులు. పనిగట్టుకుని ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో పరిస్థితులు అదుపులోకి రాక పోవడంతో దాడులు పెరిగి పోయాయి. ఎక్కడికక్కడ దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులకు సంబంధించిన ఇళ్లు, షాపులు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసాలకు పాల్పడుతున్నారు.
దీంతో తమకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా తమపై హింసను తక్షణమే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలలో ఆందోళన బాట పట్టారు హిందువులు.
ఈ సందర్బంగా కీలకమైన డిమాండ్లను తాత్కాలిక ప్రభుత్వం ముందు ఉంచారు. మైనార్టీ వర్గాల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జాతీయ పార్లమెంట్ లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మైనార్టీ రక్షణ కమిషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అంతే కాకుండా మైనారిటీలపై జరిగే అన్ని రకాల దాడులను నిరోధించేందుకు కఠినమైన చట్టాలను రూపొందించాలని కోరారు హిందువులు.