రేవ్ పార్టీలో సినీ నటులు – సీపీ
సంచలన విషయాలు వెల్లడి
బెంగళూరు – దేశ వ్యాప్తంగా కలకలం రేపింది బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీ. అశ్లీల నృత్యాలతో పాటు కార్యకలాపాలు, అసాంఘిక కార్యకలాపాలకు ఈ పార్టీ వేదికగా నిలిచింది. ఈ విషయంపై అనేక రకాలుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రేవ్ పార్టీలో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ రంగానికి చెందిన నటీ నటులు కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. వీటికి సంబంధించి కొందరు ఖండించారు కూడా.
కానీ మంగళవారం రేవ్ పార్టీకి సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ దయానంద్ . ఆయన మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ రేవ్ పార్టీ పై దాడి చేయడం జరిగిందని చెప్పారు.
కొందరిని అరెస్ట్ చేశామన్నారు. దాడుల్లో 17 ఎండీఎంఏ మాత్రలు, కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ రేవ్ పార్టీలో 25 మంది మహిళలు, కొంత మంది నటీ నటులు కూడా ఉన్నారని, మొత్తం 100 మందికి పైగా హాజరైనట్లు తెలిపారు దయానంద్.
ఆంధ్రా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన రెడ్డికి చెందిన పాస్‌తో కూడిన బెంజ్ కారు దొరికిందన్నారు. ఫామ్ హౌస్ యజమానిని గోపాల రెడ్డిగా గుర్తించామని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన వాసు పార్టీని నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా వంద మందిపై కేసు నమోదు చేశామన్నారు సీపీ.